ఎంపీ ధర్మపురి అరవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
వడ్డేరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీకి వినతి నిజామాబాద్, అక్టోబర్22 (నవగీతం ప్రతినిధి): నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌ను బుధవారం వడ్డేర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వడ్డేర ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్టీ జాబితాలో వడ్డేరలను చేర్చాలనే డిమాండ్‌ను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వడ్డేర సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వడ్డేర ప్రజలు చేస్తున్న పోరాటం, ఎదుర్కొంటున్న సమస్యలు, తమ...