navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 8:42 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎంపీ ధర్మపురి అరవింద్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు

అర్వింద్ వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేత కల్లేడ నరేష్ మండిపాటు

నవగీతం, హైదరాబాద్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఎంపీ అర్వింద్ మతి భ్రమించి, అహంకారంతో మాట్లాడుతున్నారని టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్లేడ నరేష్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ పై ఎంపీ అర్వింద్ చేసిన అహంకారపూరిత విమర్శలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, బీజేపీ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం సరికాదని, ఇకనైనా మాట్లాడేటప్పుడు సంస్కారం వహించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి, కేవలం రాజకీయ ఉనికి కోసమే ఎంపీ అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత నరేష్ ధ్వజమెత్తారు.