ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని కొడిమ్యాల మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జెల కరుణాచారి, మండల...