navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 12:51 pm Digital Edition : NAVAGEETAM

ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్

నవగీతం, ఖమ్మం:

పెద్దతండాలోని ప్రియదర్శని కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కు టెబుల్స్ ఏర్పాట్ల లను కలెక్టర్ తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిబ్రవరి 10న ఎన్నికల సిబ్బందికి అందించే సామాగ్రి పంపిణీకి ముందస్తు ప్రక్రియ పోలింగ్ సామాగ్రిని, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్, ఓటర్ లిస్ట్, బ్యాలెట్ పేపర్స్, పూర్తి సామాగ్రి సరిచూసుకోవడం పై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పోలింగ్ రోజున ఉదయమే సిబ్బంది పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకునేలా విధంగా వాహనాల ఏర్పాట్లుతో రూట్ ఆఫీసర్లు భాద్యత వహించాలని, ఎన్నికల సామాగ్రి పంపిణీ నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటూ, సమయానికి అనుగుణంగా సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ‌