ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా మాజీ సర్పంచ్ రాజీనామా

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్ సీనియర్ నేత పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు సుమారు 120 మంది అనుచరులు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పిడుగు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని...