ఎమ్మెల్సీ తాత మధును మండలి నుంచి డిస్మిస్ చేయాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య డిమాండ్ మల్లాపూర్, సెప్టెంబర్8,(నవగీతం): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు పేర్కొంటున్న అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య అన్నారు. తాత మధును శాసనమండలి నుంచి డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి నుంచి దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతారని...