ఎస్‌జీఆర్ విద్యార్థుల కరాటే ప్రతిభ

నవగీతం, మల్యాల : మల్యాల మండల కేంద్రంలోని ఎస్‌జీఆర్ స్కూల్ విద్యార్థులు కరాటే పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 25 మెడల్స్ సాధించారు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న విద్యార్థులు 8 బంగారు, 6 వెండి, 11 కాంస్య పతకాలను గెలుచుకుని పాఠశాలకు కీర్తి తీసుకువచ్చారు. బంగారు పతకాలు సాధించిన వారిలో సాఫియా, వందిత, రిషి వర్ధన్, లక్ష్మీ సాహిత్య, హర్వమ్, యూనస్, అమరేందర్, సారిక ఉన్నారు. వెండి పతకాలు సాధించిన వారిలో కార్తికేయన్, ఇజెన్ రిషీశ్వర్, మోహరాజ్,...