ఎస్జీటీ పోస్టుల రద్దును వెంటనే విరమించుకోవాలి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులను రద్దు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టీజీయూఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవిందులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాథమిక విద్యే విద్యా వ్యవస్థకు పునాది అని, అలాంటి కీలక స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఎస్జీటీ పోస్టులు...