ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను పరిశీలించిన కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల,అక్టోబర్03,(నవగీతం) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని, మెట్పల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత...