navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 11:54 am Digital Edition : NAVAGEETAM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మేడిపల్లి వార్డు సభ్యురాలు

నవగీతం,మెట్ పల్లి

జగిత్యాల జిల్లా కొండగట్టు నాచుపల్లి సమీపంలో శనివారం బృందావనం రిసార్టులో నూతన సర్పంచులు వార్డు సభ్యులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు సభ్యురాలు నెరేళ్ల రోజా రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్పంచ్లను వార్డ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని ,పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని తెలంగాణ నుంచే నాకు ఈ చైతన్యం, తెగింపు, స్ఫూర్తి, పోరాట పటిమ వచ్చాయని అంజన్న సన్నిధి నన్ను కాపాడింది వ్యక్తిగతంగా మనకు ఎవరూ శత్రువులు లేరు పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నాము.వంద మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రోజా రమేష్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకు కార్యకర్తలకు మేడిపల్లి 2వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.