navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 2:51 pm Digital Edition : NAVAGEETAM

ఐకేపీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ

నవగీతం,మెట్ పల్లి రూరల్:

మెట్ పల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామంలో 3 ఐకేపీ భవనాల నిర్మాణం రూ. 30 లక్షలతో చేపడుతుండగా శనివారం గ్రామ సర్పంచ్ పుల్ల సాయగౌడ్ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ కుమార్, ఉప సర్పంచ్ లక్మ చిన్నయ్య, వార్డ్ మెంబర్స్ నిమ్మల సాయమ్మ, చేపూరి అంజమ్మ, కోరం బావాయి, కొత్తూరి రాజేశ్వర్, ఐకేపీ సీసీ సూరయ్య, వీఓఏలు పుష్ప, సంధ్య, రేఖ, మహిళా సంఘం అధ్యక్షులు, సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.