ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తా: సర్పంచ్ కాడారి మల్లేశం
నవగీతం, కొడిమ్యాల కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత శారీరక దృఢత్వం పెంపొందించుకునే ఉద్దేశంతో గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని గ్రామ యువత గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడారి మల్లేశం , ఉప సర్పంచ్.ఎడమల పెళ్లి సంతోష్ లకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ యువత ప్రతినిధులు మాట్లాడుతూ, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో యువతతో పాటు పెద్దలు, వృద్ధులు కూడా వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు...