navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 3:44 am Digital Edition : NAVAGEETAM

కనక సోమేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ కనక సోమేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయ కమిటీ, శివ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూపొందించిన ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 13 వ తేదీ శుక్రవారం నుండి మొదలుకొని – 17వ తేదీ మంగళవారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని కమిటీ వారు తెలియజేశారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సంగ గంగారాజం, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారం, డాక్టర్ ఆకుతోట హిమవర్ష,  డాక్టర్ గంగారాజం, ఎనుగంటి నరేష్, షబ్బీర్, రాజం, సుంకేటి జీవన్, అల్లె చంద్రయ్య, ఏనుగు వెంకటరెడ్డి, వెల్మల రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.