కనులపండువగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
స్వామివారిని దర్శించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఏకిన్ పూర్ శివారు పంచముఖ హనుమాన్ ఆలయం మంగళవారం భక్తిపారవశ్యంలో మునిగితేలింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతోత్సవాలను వార్డు ప్రజలు, భక్తులు అత్యంత వైభవంగానిర్వహించారు. ఈ వేడుకలు కనులపండువగా జరగడమే కాకుండా, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు. వారితో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు...