కనుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

నవగీతం, కోరుట్ల: కోరుట్ల పట్టణం 6వ వార్డు పరిధిలోని యేకిన్ పూర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని పంచముఖ ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా వార్డు కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో తన స్వగృహం నుండి స్వామివారికి సమర్పించే మెట్టెలు, పుస్తెలు, పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను తలపై ధరించి భక్తిశ్రద్ధలతో శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ సాగిన...