కబ్జా కోరల్లోంచి.. ‘హైడ్రా’ చేతుల్లోకి!
రూ. 25 కోట్ల విలువైన పార్కు స్థలం రక్షణ ఫలించిన కాలనీవాసుల పదేళ్ల పోరాటం హర్షం వ్యక్తం చేసిన భాగ్యలక్ష్మి కాలనీవాసులు నవగీతం, కుత్బుల్లాపూర్ : ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన 'హైడ్రా' మరోసారి తన పనితనాన్ని చాటుకుంది. తప్పుడు పత్రాలతో పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన కబ్జాదారుల ఎత్తులను చిత్తు చేస్తూ.. సుమారు రూ. 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. పదేళ్లుగా ఈ స్థలం కోసం పోరాడుతున్న కాలనీవాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చొరవతో ఎట్టకేలకు న్యాయం జరిగింది....