కమల నిలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నవగీతం,జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం "కమలనిలయం" లో77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డా. శ్రావణి మాట్లాడుతూ భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలని అన్నారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగేందుకు పునాది వేసిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సమాన...