navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కరీంనగర్ బంద్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌస్ అరెస్ట్

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ పార్టీ నాయకత్వం ఇచ్చిన కరీంనగర్ బంద్ పిలుపు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు బయలుదేరిన ఆయనను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు.ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను అణచివేసే ప్రభుత్వం. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాజ్యాంగ పాలన అమలులో ఉందా అని ప్రశ్నించారు.తమపై జరిగిన దాడికి నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ఆయన నిలదీశారు. అవమానకర వ్యాఖ్యలు చేసిన నాయకులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, వాటిని నిరసించేందుకు వెళ్తున్న మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు.? అని ప్రశ్నించారు.ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించి బంద్‌ను అడ్డుకోలేరు అన్నారు.ఇంత పిరికితనంతో వ్యవహరించే వారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. పరిపాలనకు వారు పనికిరారు అంటూ ఘాటుగా స్పందించారు.ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తోందని, ఇలాంటి పరిపాలన ఎక్కువ రోజులు కొనసాగదని సుంకె రవిశంకర్ వ్యాఖ్యానించారు.