కరీంనగర్ బంద్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌస్ అరెస్ట్

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ పార్టీ నాయకత్వం ఇచ్చిన కరీంనగర్ బంద్ పిలుపు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు బయలుదేరిన ఆయనను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు.ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను అణచివేసే ప్రభుత్వం. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాజ్యాంగ పాలన అమలులో ఉందా...