కలెక్టర్ అనుదీప్ ను కలిసిన సిరిపురం కేజీ గ్రామస్తులు
రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తా కలెక్టర్ హామీ నవగీతం,వైరా వైరా మండలం సిరిపురం కేజీ లో అనుమతులు లేకుండా సెల్ టవర్ నివాస గృహాల మధ్య నిర్మాణం చేపట్టారు. గ్రామ ప్రజలు సెల్ టవర్ నిర్మాణానికి నిరాకరించి నిర్మాణాన్ని నిలిపివేయాలని పలుమార్లు నిరసన తెలిపారు. ఏమి పట్టినట్టుగా సెల్ టవర్ నిర్మాణం చేపట్టారు.గ్రామస్తులు ఆగ్రహంతో సెల్ టవర్ నిర్మాణం కోసం తీసిన గుంటలో దిగి నిరసన తెలిపారు అనంతరం స్థానిక ఎస్సై పుష్పాల రామారావు వచ్చి స్థానికులకు నచ్చచెప్పి నిర్మాణ పనుల్ని ఆపారు. అనంతరం...