navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:13 pm Digital Edition : NAVA GEETAM

కాంగ్రెస్ గ్రామ శాఖల నూతన కమిటీల నియామకం

నవగీతం, అక్టోబర్5,(నవగీతం)

మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, పాత దామరాజ్‌పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను నియమించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి.

నూతన బాధ్యులు:

వాల్గొండ: గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లంబాడిపెల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడిగా కటికల గంగాధర్.

పాత దామరాజ్‌పల్లి: గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గడ్డం రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఆరెల్లి ఎల్లా గౌడ్.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లాల జలపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, ఎం.డి. జమాల్, రొండ్ల రాజారెడ్డి, కిరణ్, కోటగిరి ఆనంద్ గౌడ్‌,డి ప్రతాప్,సామ మోహన్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.