కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
నవగీతం,చొప్పదండి చొప్పదండి పట్టణ కేంద్రానికి పలువురు కరీంనగర్ ఇందిరా భవన్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో వడ్లూరి సరిత-శ్రీనివాస్ దంపతులు, వడ్లూరి రాజయ్య, సింహాచలం తులసి -ప్రభాకర్ దంపతులు చేరగా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి,...