కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా  గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవగీతం,మెట్ పల్లి: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మెట్ పల్లి పట్టణం లో  సుజిత్ రావు  నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి జాతీయ జెండాను టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుజిత్ రావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కిసాన్...