కాన్షిరామ్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు.

నవగీతం,పెద్దపల్లి: కాన్షిరామ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల పక్షాన ముందుకు సాగుతామని మాదిగ శక్తి వ్యవస్థాక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ తెలిపారు. మాదిగ శక్తి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి ఆధ్వర్యంలో కాన్షిరామ్ 92వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా కూడలిలో కాన్షిరామ్ విగ్రహానికి సురేందర్ సన్ని, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేందర్ సన్ని మాట్లాడుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అట్టడుగు జాతులను రాజ్యాధికారం వైపు నడిపించినప్పుడే కాన్షిరామ్ కు నిజమైన నివాళులు...