కార్మికుల సంక్షేమానికి భరోసా: సొంత నిధులతో ఇన్స్యూరెన్స్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నవగీతం ,కోరుట్ల ప్రతినిధి : మే డే వేడుకల సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కార్మికుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కోరుట్లలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోని వ్యాపార సముదాయాల్లో శ్రమిస్తున్న కార్మికులకు తన స్వంత నిధులతో లేబర్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని కొనియాడారు. కార్మికులంతా ఐకమత్యంతో యూనియన్‌గా ఏర్పడితే హక్కుల సాధన సులభమవుతుందని, వారి...