కాలేజీ గ్రౌండ్‌లో నిరుపయోగంగా వ్యాయామ పరికరాలు

నెలలు గడిచిన పట్టించుకొని మున్సిపల్ అధికారులు నవగీతం , కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం (కాలేజీ గ్రౌండ్)లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు అలంకారప్రాయంగా మారాయి.గత కొన్ని నెలలుగా వ్యాయామ పరికరాల హ్యాండిల్స్ విరిగిపోయి దర్శనమిస్తుండటంతో, ఫిట్‌నెస్ కోసం వచ్చే పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాలేజి గ్రౌండ్‌లో వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ వందలాది మంది యువకులు, వృద్ధులు మరియు మహిళలు...