navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 11:32 am Digital Edition : NAVAGEETAM

కుల గణన పై సుప్రీం కోర్టు తీర్పు చరిత్రాత్మకం  గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా

నవగీతం,హైదరాబాద్ :

జనగణనలో కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలైన రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసిన సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచూ కుల గణన పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సమాజంలో వెనుకబడిన కులాల విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడానికి దోహదం చేస్తుందన్నారు ప్రస్తుతం జరుగుచున్న జన గణనలో సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి కేంద్ర ప్రభుత్వం కుల గణన పై అధికారికంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు