navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 2:12 am Digital Edition : NAVAGEETAM

కూల్ వాటర్ ఫ్రిజ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ సెంటర్ లో స్థానిక ప్రజల అవసరాల కోసం ఉచిత మినరల్ కూల్ వాటర్ ఫ్రిజ్ ను వుటూరి వాసు సౌమ్య సహకారంతో ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. జగిత్యాల నిత్య జన గణ మన నిర్వహకుల ఆధ్వర్యంలో దివంగత వుటూరి గంగారం – సరోజనల జ్ఞాపకార్థంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిత్య జన గణ మన కార్యక్రమం నిర్వాహకులు ఉన్నారు