కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: పిఎం పోషణ్' తనిఖీ లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న కామన్ మెనూ ప్రకారం వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు తదితర అంశాలను సమీక్షించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు మరియు ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పదవ...