navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 5:24 pm Digital Edition : NAVAGEETAM

కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ , ఎమ్మెల్సీ రమణ దావ వసంత , లోక బాపు రెడ్డి తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈనెల 20వ తేదీన జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ బహిరంగ సభను చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు.. ఈ వేదికలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.సభ విజయవంతానికి గ్రామ స్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.