కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చేనేత రంగానికి ఘోర అన్యాయం:
కె.బి -రామ్మోహన్ పద్మశాలి నవగీతం,మంచిర్యాల: సోమవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశానికి గర్వకారణమైన చేనేత రంగానికి ఇచ్చిన కేటాయింపులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురిచేసిందని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ బత్తిని రామ్మోహన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లక్షలాది చేనేత కుటుంబాల జీవనాధారమైన ఈ కళారంగానికి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది చేనేతల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవమానానికి నిదర్శనం. ఈ బడ్జెట్ పై తీవ్ర నిరసన గళం వినిపిస్తున్నాం. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అని గొప్పలు...