కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి సీతక్క

నవగీతం,జగిత్యాల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నూకపల్లి న్యాక్ సెంటర్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 23 వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మొదటి విడుత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడికి ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కి అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆశలు, ఆశయాలు,...