కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
పదో తరగతి విద్యార్థినులకు విద్యాభ్యాసం, పరీక్షల సన్నద్ధతపై మార్గనిర్దేశం జగిత్యాల, సెప్టెంబర్11,(నవగీతం): జగిత్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచితో పాటు విద్యార్థినులకు అందుతున్న ఆహారంపై వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో...