navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 11:15 am Digital Edition : NAVAGEETAM

కేరళ గ్లోబల్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

నవగీతం,రుద్రంగి

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలోని కేరళ గ్లోబల్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి పండుగ విశిష్టతను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. పాఠశాల చైర్మన్ బాబు నంబియార్ మాట్లాడుతూ విద్యార్థులు భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు పండుగ సంప్రదాయాలను ప్రదర్శించగా, పెద్ద తరగతి విద్యార్థులు రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. అలాగే బాలురు కైట్ ఫెస్ట్‌వల్లో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ లతికా మాట్లాడుతూ.. పిల్లలందరూ కైట్స్ ఎగిరేసేటప్పుడు మాంజా దారం వాడొద్దని దాని వలన పక్షులకు మరియు అందరికీ హాని కలుగుతుంది పిల్లలకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు