కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
నవగీతం,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 72.వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామపంచాయతీ ఆవరణలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. కరీంనగర్‌కు చెందిన సన్‌రైజ్ హాస్పిటల్ వైద్య బృందం సుమారు 300 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే...