కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ అశోక్ కుమార్
మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పి జగిత్యాల/మల్లాపూర్, అక్టోబర్4,(నవగీతం): మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో భాగంగా ఎస్పీ ఈ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు తదితర అంశాలను ఎస్పీ గారు పరిశీలించారు. ప్రతి కేసులో దర్యాప్తును నిబంధనల ప్రకారం...