కొండగట్టులో పెద్ద జయంతి వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: అదనపు ఎస్పీ చేతన్ నితిన్

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈ నెల 10 నుండి 13 వరకు నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జయంతి వేడుకల సందర్భంగా వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని...