కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలకు శ్రీకారం

గోడపత్రిక ఆవిష్కరణ నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 10-05-2026 ఆదివారం నుండి 12-05-2026 మంగళవారం వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎస్. అంజనారెడ్డి తెలిపారు.ఉత్సవాల సందర్భంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయని చెప్పారు. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజల్ సేవలు...