navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 5:18 pm Digital Edition : NAVAGEETAM

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని రామగుండం ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి మనాలి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.తదనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె సుమారు 453 గ్రాముల వెండి గదను, దాదాపు రూ.1,38,000 విలువైనదాన్ని అంజన్నకు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు వేదోక్తంగా ఆశీర్వచనం చేసి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపప్రధాన అర్చకులు చిరంజీవి, ముఖ్య అర్చకులు రాము, టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెక్కిల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.