కొండగట్టు అంజన్న ఆలయంలో అంతర్గత బదిలీలు,ప్రమోషన్లు
ఆలయ కార్యనిర్వాహణ ఆధికారి అంజన రెడ్డి నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామి దేవస్థానంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు,ప్రమోషన్లను అమలు చేస్తూ ఆలయ ఈఓ అంజనారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు డి. సునీల్ కుమార్‌ను సూపరింటెండెంట్‌గా నియమిస్తూ పరిపాలన విభాగం, లీగల్, లీజులు, లైసెన్సులు, కోర్టు కేసులు, భూములు, ప్రసాదం, అకౌంట్స్, మనీవాల్యూ, ఇంజనీరింగ్, సిబ్బంది విధి నిర్వహణ, బుకింగ్ కౌంటర్లు, దేవాలయ విభాగాల పర్యవేక్షణతో పాటు అన్నదాన కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.యు. చంద్రశేఖర్‌కు సీనియర్ అసిస్టెంట్ పదవి...