కొండగట్టు అంజన్న ఆలయ ఈవోగా రమాదేవి బాధ్యతలు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఆలయ ఈవోగా రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమాదేవికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, వీఐపీ భక్తులైనా, సాధారణ భక్తులైనా అందరికీ సమానంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి...