కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం రూ.75 లక్షలు నగదు

భక్తుల ఫిర్యాదు లేఖలు కలకలం నవగీతం,కొడిమ్యాల మల్యాల మండలంలోని కొండగట్టు దేవస్థానం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు.లలితా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో గత 17 రోజుల్లో మొత్తం రూ.75,02,126 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు.హుండీ లెక్కింపు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భక్తులు నగదు, కానుకలతో పాటు తమ సమస్యలను వివరించిన ఫిర్యాదు లేఖలను కూడా హుండీలో వేయడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ లేఖల్లో ఆలయ పరిసరాల్లో ప్రాథమిక సదుపాయాల లేమిపై...