కొండగట్టు దేవస్థానానికి ఐఎస్వో ధ్రువీకరణ
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కు ఐఎస్వో (ISO) ధ్రువీకరణ లభించింది. ఆలయ పరిపాలన, భక్తులకు అందిస్తున్న సేవలు, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యవస్థలను పరిశీలించిన అనంతరం ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఈ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసింది.ఈ సందర్భంగా ఐఎస్వో ప్రతినిధులు శ్రీమతి రామలక్ష్మి, సత్యసాయి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎస్ అంజనారెడ్డి స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా చేపట్టిన...