కొండగట్టు ఆంజనేయుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.తెల్లవారుజామునే భారీ సంఖ్యలో చేరుకున్న భక్తులు కోనేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొక్కులు చెల్లించుకున్న అనంతరం క్షేత్రపాలకుడైన శ్రీ బేతలస్వామి ఆలయంను కూడా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయానికి సుమారు 20 వేల మంది భక్తులు విచ్చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ ప్రాంగణంలో రద్దీని...