కొండగట్టు ఈవోకు వినతిపత్రం అందజేసిన ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు అక్కపెల్లి రవీందర్ ఆలయ ఈవో అంజన రెడ్డికి వినతిపత్రం అందజేశారు.​భక్తుల సౌకర్యార్థం ఆలయ సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వినతిపత్రంలో పేర్కొన్న ప్రధాన అంశాలు.వేసవి దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సదుపాయంతో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి.​గతంలో...