కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఈ నెల 10 నుంచి 13 వరకు జరగనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.గత ఉత్సవాల్లో శానిటేషన్, విద్యుత్, చలువ పందిళ్ల ఏర్పాట్లలో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్,...