కొడిమ్యాలలో ‘వాక్ ఫర్ అడ్మిషన్’ కార్యక్రమం
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శుక్రవారం “వాక్ ఫర్ అడ్మిషన్” పేరుతో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. గోపాల్ నేతృత్వంలో అధ్యాపకులు, గ్రామ పెద్దలు కలిసి స్థానిక బస్టాండ్ నుంచి అంగడి బజారు వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రభుత్వ కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.గోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఆల్పాహారం, మధ్యాహ్న...