కొడిమ్యాలలో హిందూ సంఘాల నిరసన

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల పట్టణం అంగడి బజార్‌లో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, యువకులు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.హిందూ మనోభావాలను దెబ్బతీసేలా, హిందూ నినాదాలు దేవుళ్లను కించపరిచే విధంగా మంత్రి మాట్లాడారని నిరసనకారులు ఆరోపించారు. “జై శ్రీరామ్ అంటే పైనుండి డబ్బులు పడుతాయా” అని మంత్రి ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారని పేర్కొంటూ, ఇది హిందూ సమాజంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రి...