కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం… మరో ఆవు బలి

నవగీతం, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని సూరంపేట గ్రామ శివారులో సంచరిస్తున్న పెద్దపులి మరో ఆవును బలితీసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉదయం గ్రామస్తులు పొలాల వద్దకు వెళ్లిన సమయంలో ఆవు మృతదేహాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి దాడి చేసిన ఆనవాళ్లను గుర్తించిన అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను రాత్రి వేళల్లో బయట వదలకుండా జాగ్రత్తలు...