కోరుట్లలో ఊపందుకున్న తాటి ముంజల అమ్మకాలు :

నవగీతం,కోరుట్ల ప్రతినిధి : ఎండలు ముదురుతుండటంతో కోరుట్ల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ తాటి ముంజల విక్రయాలతో సందడిగా మారాయి. వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన సహజ సిద్ధమైన ఆహారంగా పేరున్న తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడటమే కాకుండా, సహజ సిద్ధమైన కూలెంట్‌గా పనిచేసి శరీర వేడిని తగ్గిస్తాయి. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి బరువు తగ్గడానికి కూడా ఇవి తోడ్పడతాయని...